వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు  తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 

చిలికా సరస్సు వద్ద ఏర్పడిన వాయుగుండం రాత్రి బలహీన పడి అల్పపీడనంగా మారిందని.. ఇది వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాన్ని తాకిందని తెలిపింది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వెల్లడించింది.