వరద ఎఫెక్ట్​: పూర్తిగా నిండిన డిండి ప్రాజెక్టు

డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం...  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తున్నది.  భారీగా వరద నీరు చేరడంతో డిండి ప్రాజెక్ట్​ కు అలుగు పోస్తున్నారు. ప్రాజెక్టులోని నీటిని  ఉండగా ప్రధాన కాలువ ద్వారా 250 క్యూక్కుల నీటిని సేద్యానికి వదులుతున్నారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోసే అవకాశం ఉంది.

నల్గొండ జిల్లా కు సాగునీరు అందించే ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు నక్కల గండి రిజర్వాయర్ ముంపు లో ఉన్నది. . గత మూడు, నాలుగు రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ జలకళతో నిండి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉధృతంగా రావడం, పూర్తిగా మర్లపాడు గ్రామాన్ని చుట్టుముట్టి జలదిగ్బంధంలో ముంచివేసింది. ప్రజా ప్రతినిధులు అధికారులు మా గోసను చూసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో  వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే, కలెక్టర్ ఇతర అధికార బృందం మర్లపాడు తండా గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో చర్చిస్తున్నారు. 

Also Read :- నిండుకుండలా ప్రాజెక్టులు