అయ్యోపాపం.. అకాల వర్షాల ఎఫెక్ట్​. . పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

అయ్యోపాపం..  అకాల వర్షాల ఎఫెక్ట్​. . పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

పేదోళ్లకు రెక్కాడితేకాని డొక్కాడదు.. వానొచ్చినా.. వరదొచ్చినా వ్యవసాయ కూలీలు.. కూలి పనికెళితేనే పొట్ట నిండేది.  అలా కూలి పని చేసే  ఇద్దరి మహిళలను అకాల వర్షం పొట్టన పెట్టుకుంది.   పూర్తి వివరాల్లోకి వెళ్తే...  నాగర్​ కర్నూల్​ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.  ఈ ప్రమాదంలో మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ, గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పనికోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుల  కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read : బెంగళూరులో భారీ వర్షం

ఇదిలా ఉంటే  వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఆదిలాబాద్​,మంచిర్యాల, నిర్మల్​, కుమరం భీం, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్​ ఎలెర్ట్​ జారీ చేసింది.  మరో నాలుగు రోజులపాటు ( ఏప్రిల్​ 3 నుంచి) ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.