వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

కోనరావుపేట, వెలుగు: పక్క రైతు ఒర్రెను పూడ్చడంతో వర్షానికి తన పంటకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పుట్ట నర్సయ్యకు గ్రామ శివారులో పొలం ఉంది. 

పక్కనే ఉన్న రైతు ఒర్రెను పూడ్చడంతో  ఇటీవల కురిసిన వర్షాలకు తన పొలం కొట్టుకపోయిందని ఆరోపించారు. దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామంలోని వాటర్ ట్యంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని నర్సయ్యకు  నచ్చజెప్పి  కిందికి దింపి కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించాడు.