Rain Affect:యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్ష బీభత్సం..రోడ్లపై విరిగిపడ్డ చెట్లు

Rain Affect:యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్ష బీభత్సం..రోడ్లపై విరిగిపడ్డ చెట్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ,ఈదురు గాలులు కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టం కలిగించాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. బలమైన ఈదురు గాలులలో భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగి పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. జేసీబీతో చెట్లను తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు వలిగొండ పోలీసులు. మరోవైపు వలిగొండ మండలంలోని పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లపై చెట్లు, విద్యుత్ తీగలు పడిపోవడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది.పంటలకు నష్టం కలిగించింది.