మరో రెండు గంటల్లో హైదరాబాద్లో వర్షం

మరో రెండు గంటల్లో హైదరాబాద్లో వర్షం

బంగాళాఖాతంలోరెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్న క్రమంలో అవి అల్పపీడనంగా మారే అవకాశ ఉంది..దీంతో తెలంగాణలో భారీవర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో నగరంలో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 

ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ లో వాతావరణం మేఘావృతంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అయితే రానున్న రెండు గంటల్లో మరోసారి హైదరాబాద్ సిటీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. 

ALSO READ | Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్