హైదరాబాద్సిటీ, వెలుగు: సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం దంచికొట్టింది. రాత్రి 11 నుంచి 12 గంటల లోపు గంటలో 4 సెంటీ మీటర్ల వాన కురిసింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 4.33 సెంటీమీటర్ల వాన పడింది. ఏకధాటి కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని మేయర్విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ క్షేత్రస్థాయిలో వరద నీటిని తొలగించాయి.
ప్రాంతం వర్షం(సెం.మీ.లలో)
కుత్బుల్లాపూర్ 4.33
కాప్రా 4.28
చర్లపల్లి 4.08
గాజులరామారం 3.90
నేరేడ్మెట్ 3.73
మారేడ్పల్లి 3.60
అల్వాల్ 3.50
మల్కాజిగిరి 3.38
ఉప్పల్ 3.28
బాలానగర్ 3.15
శేరిలింగంపల్లి 2.65
కూకట్పల్లి 2.48