చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ప్రారంభమై 3 ఓవర్ల ఆట జరగ్గానే వరుణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది మైదానాన్ని అంతటిని కవర్లతో కప్పి ఉంచారు.
అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై.. బెంగుళూరు జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (19), డుప్లెసిస్ (12) ధాటిగా ఆడుతున్నారు. తుషార్ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు రాగా.. శార్దూల్ ఠాకూర్ రెండో ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లు ముగిసేసరికి బెంగుళూరు స్కోర్.. 31/0. డుప్లెసిస్ (12), విరాట్ కోహ్లీ (19) క్రీజులో ఉన్నారు.
The engine’s warmed up. When the rain stops, the run fest shall begin 🙏
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
RCB: 31/0, after 3 overs.#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK pic.twitter.com/zKkvXorgGd
Wish we could do this, but for now, let’s pray 🙏
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
RAIN RAIN GO AWAY! ☔️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK pic.twitter.com/VUsZhrXIva