వాతావరణం చల్లబడుతోంది. మేఘాలు ఊరిస్తున్నాయి. తొలకరి జల్లుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టైంకి వానలు పడ్డయా.. సంతోషం. ఒకవేళ అటూ ఇటూ అయితే వరుణ దేవుడి దయ కోసం పూజలు చేస్తారు. కప్ప తల్లి పూజ దగ్గరి నుంచి జంతు బలుల దాకా.. ఆచారాలు, సంప్రదా యాలు ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతున్నా యి. అయితే ఆ ఊళ్లో మాత్రం విచిత్రమైన పద్ధతిని ఫాలో అవుతున్నారు.
వంద ఏళ్లుగా వానను లెక్కించేందుకు ఓ గుడి గోపురం వంకే చూస్తున్నారు. ‘రెయిన్ టెంపుల్'గా ఆ ఆలయం పాపులర్ కూడా. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా.. ఘటంపూర్ ఏరియాలోని బితర్గావ్ బెహతాలో ఉందీ పూరి జగన్నాథుడి ఆలయం. ఈ గుడి పై కప్పు నుంచి లీక్ అయ్యే నీటి ధారలు.. ఆ ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయన్నది చెబుతుందని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. నైరుతి రుతుపవ నాలు ప్రవేశించాక.. ముహుర్తం చూసుకుని ఒకరోజు ఈ పూజల్ని నిర్వహిస్తారు.
ఆ రోజున గుడి పైకప్పు నుంచి నీరు లీకవుతుంది. నీళ్లు ఎక్కువగా పడితే.. భారీ వర్షాలు పడతాయని, ఒకవేళ చిన్న చుక్క పడితే ఆ ఏడాది కరువు తప్పదని భావిస్తారు. ఫలితం ఏదైనా పూజలు మాత్రం ఆగవట. అయితే గుడిలో ఏడాది పొడవునా పూజలు జరుగుతున్నప్పటికీ.. ఆ ఒక్కరోజే నీటి ధారలు పడటం ఇప్పటికీ సస్పెన్స్. ఈ మిస్టరీ తెలుసుకునేందుకు ఎంతో మంది పరిశోధకులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
చరిత్రలో.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. దేశంలోని ప్రాచీన ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రత్యేకమని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అశోక చక్రవర్తి కాలంలో నాటి స్థూపాల్ని పోలి ఉన్న నిర్మాణా ల్ని ఈ ఆలయంలో చూడొచ్చు. ఇక్కడ జన్మాష్ట మిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ పూజారి కేపీ శుక్లా చెబుతున్నాడు.