వరద గుప్పిట్లో అస్సాం

వరద గుప్పిట్లో అస్సాం
  • అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు
  • వానల దాటికి 9మంది మృతి
  • నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు, మూగ జీవులు
  • అస్తవ్యస్తమైన రహదారులు
  • పొంగి, పొర్లుతున్న వాగులు, వంకలు

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల దాటికి పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు చోట్ల వంతెనలు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రభావం దాదాపు 6.62 లక్షల మంది ప్రజలపై పడింది. వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకూ ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. అంతే కాకుండా వందల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లగా...  వరదల్లో చిక్కుకొని మూగజీవాలు, వన్యప్రాణులు మృత్యువాతపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పారా మిలటరీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినా, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం కొండచరియలు విరిగిపడయతాయని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. 


మరిన్ని వార్తల కోసం...

మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు