తూర్పు - మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడన ప్రాంతం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22న ఉదయం అదే ప్రాంతంలో వాయుగుండంగా ఏర్పడింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి అక్టోబర్ 23 న తుఫాన్ గా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని 24వ తేది రాత్రి లేదా 25 న ఉదయం పూరి.. సాగర్ ఐలండ్స్ మధ్య దాటే అవకాశం ఉంది.
ALSO READ | అనంత అతలాకుతలం... నీట మునిగిన కాలనీలు
ఈ ప్రభావంతో అక్టోబర్ 22,23,234తేదీల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 22న కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు మధ్య దక్షిణ జిల్లాలో అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశంతో పాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.