పింక్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు..తొలి రోజు వర్షార్పణం

పింక్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు..తొలి రోజు వర్షార్పణం

కాన్‌‌‌‌‌‌‌‌బెర్రా : ఇండియా, ప్రైమినిస్టర్స్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌ మధ్య రెండు రోజుల పింక్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో శనివారం తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బాల్‌‌‌‌‌‌‌‌ కూడా సాధ్యపడలేదు. వాతావరణం అనుకూలిస్తే ఇరుజట్ల మధ్య ఆదివారం 50 ఓవర్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించనున్నారు. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేసినప్పటికీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో నాణ్యమైన పేసర్లను ఎదుర్కొనే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండాపోయింది. రెండో రోజు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత టీమిండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌పై ఓ అంచనాకు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ జట్టులోకి రానున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌ హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌.. ఇండియాతో పింక్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ ‘లో గ్రేడ్‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీ’తో బాధపడుతున్నాడని క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. అయితే హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా ఎవర్నీ తీసుకోలేదు. ఇప్పటికే రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ కోసం సీన్‌‌‌‌‌‌‌‌ అబాట్‌‌‌‌‌‌‌‌, బ్రెండన్‌‌‌‌‌‌‌‌ డాగెట్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు