చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలోని ముస్లిం కాలనీలో ఉన్న పీఎస్ స్కూల్ శనివారం వరద నీటితో నిండిపోయింది. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్లాస్ రూమ్‌లోకి నీరు చేరడంతో శనివారం స్టూడెంట్లతో పాటు పేరెంట్స్ నిరసన తెలిపారు. స్కూల్‌కు గతేడాది చేసిన రిపేర్లు క్వాలిటీగా లేకపోవడం వల్లే నీరంతా క్లాస్ రూమ్‌లోకి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు కంప్లైంట్ చేయనున్నట్లు చెప్పారు. ఆఫీసర్లు స్పందించి క్లాస్‌రూమ్‌లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్లు, పేరెంట్స్ కోరారు.