నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ కు వరద పోటు.. ఐదు గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ కు వరద పోటు.. ఐదు గేట్లు ఎత్తివేత

 నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అయిన సింగూర్‌ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల విడుదల చేయడంతో ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 30వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి  ఐదు గేట్ల ద్వారా 36,500 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేసున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ శివ ప్రసాద్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులకు (17. 802 టీఎంసీలు) 1404.64 అడుగుల (17.282 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17.252 టీఎంసీల నీరు వరద నీరు ఉందని ఆయన తెలిపారు.  

ఎస్సారెస్పీలోకి 50,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

 మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది.   ప్రాజెక్ట్‌లోకి 50,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థా యి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా,ప్రస్తుతం 1090 అడుగుల (76. 894 టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. 5,882 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.