దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

రాబోవు 48 గంటలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు  భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  

వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న 2-3 రోజుల్లో మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రాబోయే 5 నుండి 7 రోజుల పాటు పశ్చిమ బెంగాల్ సహా వాయువ్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో రానున్న రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆరెంజ్ అలర్ట్

కింద చెప్పబడిన రాష్ట్రాలలోఏకాంత ప్రదేశాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

  • లక్షద్వీప్ (ఆగస్టు 19, 20)
  • తమిళనాడు (ఆగస్టు 19)
  • పుదుచ్చేరి (ఆగస్టు 19)
  • నాగాలాండ్ (ఆగస్టు 19)
  • మణిపూర్ (ఆగస్టు 19)
  • మిజోరం (ఆగస్టు 19)
  • త్రిపుర (ఆగస్టు 19)
  • జార్ఖండ్ (ఆగస్టు 19, 20)
  • కేరళ (ఆగస్టు 19, 20)
  • తూర్పు ఉత్తర ప్రదేశ్ (ఆగస్టు 19, 20)
  • గంగానది పశ్చిమ బెంగాల్ (ఆగస్టు 19, 20)

అలాగే, ఆగస్టు 20, 21 తేదీల్లో ఉత్తరాఖండ్ మరియు ఆగస్టు 21, 22 తేదీల్లో బీహార్‌లో IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.