గ్రేటర్ పరిధిలో సోమవారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 3 గంటల వరకు వాతావరణం పొడిగా ఉండగా, తర్వాత సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. జల్లులతో మొదలై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనిచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొమ్మలు విరిగి పడ్డాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. అత్యధికంగా గోల్కొండలో 5.80 సెంటీమీటర్ల వాన పడింది.
కూలిన స్తంభాలు, తెగిపడిన తీగలు, చెట్ల కొమ్మలతో చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఉక్కపోతతో జనం అల్లాడారు. ఆఫీసుల నుంచి జనం ఇండ్లకు వెళ్లే టైంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మంగళ, బుధవారాల్లో తేలికపాటి వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
– వెలుగు, హైదరాబాద్
వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
ప్రాంతం వర్షపాతం(సెం.మీ.)
గోల్కొండ 5.80
ఆసిఫ్‌నగర్ 5.70
ఖైరతాబాద్ 5.25
ఎంసీఆర్ హెచ్ఆర్ డీ 4.67
బంజారాహిల్స్ 4.60
ఫిలింనగర్ 4.20
షేక్ పేట 3.87
ఉప్పల్ 3.67
హిమాయత్ నగర్ 3.67
ముషీరాబాద్ 3.55
మాదాపూర్ 3.50
బోరబండ 3.35
పఠాన్ చెరు 3.25