తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదివారం నాడు తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం నాడు తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నాడు అత్యల్పంగా నిర్మల్ జిల్లా తానూర్ లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. మరో 20 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.