రాయినిగూడెం పీఏసీఎస్ లో భారీ కుంభకోణం

గరిడేపల్లి, వెలుగు: రాయినిగూడెం పీఏసీఎస్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని  కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్ కే చాంద్ మియా  ఆరోపించారు. బుధవారం కీతవారిగూడెంలో ఆయన మాట్లాడుతూ రైతులకు చెందిన దాదాపు రూ. 20 లక్షలను దోపిడీ చేశారన్నారు. వెంటనే పాలకవర్గాన్ని, సిబ్బందిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.  8 లక్షలు దొంగతనం జరిగినట్టుగా పోలీసులు ధ్రువీకరించారన్నారు. బ్యాంక్ లో సీసీ కెమెరాలు లేకుండా సిబ్బంది, పాలకవర్గం రూమ్ లలో ఏసీలు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.  ఇలాంటి అవినీతిపరులపై అధికారులు చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కీత సోమయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, జుట్టుకొండ లక్ష్మినారాయణ, కీత మట్టయ్య, కృష్ణమూర్తి,బాధే నర్సయ్య,వరికుప్పల శ్రీను తదితరులు పాల్గొన్నారు.