గరిడేపల్లి, వెలుగు : రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన్‌గా జుట్టుకొండ సత్యనారాయణ(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. మాజీ పీఏసీఎస్ చైర్మన్ ముప్పారపు రామయ్య(బీఆర్‌ఎస్) పై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరి 2న ఓటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఫలితాన్ని ప్రకటించొద్దని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో అధికారికంగా వెల్లడించలేదు.
అయితే ఫిబ్రవరి 27న ముప్పారపు రామయ్య వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో డీసీవో పద్మ అతడిని అనర్హుడిగా ప్రకటించడంతో పాటు శనివారం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ సమావేశానికి 9 మంది డైరెక్టర్లు హాజరు కాగా సత్యనారాయణ మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డీసీవో ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని అందించారు.