రానున్న రెండు రోజులు (జులై 31, ఆగస్టు 01) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు 2023 జులై 31 సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రేపు 2023 ఆగస్టు 01 మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు 2023 ఆగస్టు 01 మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆగస్టు 02 బుధవారం నుంచి ఆగస్టు 06 ఆదివారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.