బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన

బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ (సెప్టెంబర్ 20) కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు నల్గొండ జిల్లాలో అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. 

ALSO READ | బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..

 ఇవాళ ఉదయం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో పొడి వాతావరణం ఉండగా.. సాయంత్రానికి వెదర్ మారిపోయింది. ఆకాశం మేఘావృతమే మబ్బులు అలుముకున్నాయి. హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తమైంది. 

ఇదిలా ఉంటే, ఇటీవల రాష్ట్రంలో కుండపోత వర్షం, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. చెరువులు, కాలువలు, వాగులు, నాళాలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధం అయ్యాయి. భారీ వర్షం, వరదల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో జనాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.