
మెదక్టౌన్, వెలుగు: రెండుమూడు రోజులుగా వానలు పడుతుండడంతో మెదక్, హవేళీఘనపూర్మండలాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం కూలీల కొరత లేకుండా ముందుగానే బిహార్, యూపీ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను సైతం పిలిపించుకొని నాట్లు వేయిస్తున్నారు.
ఎకరానికి కొంత గుత్తగా మాట్లాడుకుని నాట్లు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వరినాట్లు చివరి దశకు చేరుకోనున్నాయి.