హైదరాబాద్ సిటీ శివార్లలోని మోకిలాలో అద్భుతమైన విల్లాలు.. ఒక్కో విల్లా కోట్ల రూపాయల్లో ఉంటుంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. మోకిలాలోని లా పాలోమా విల్లా వెంచర్ నీట మునిగింది. విల్లాలకు వెళ్లే రహదారులు అన్నీ నడుం లోతు నీటిలో ఉన్నాయి. నీళ్లు వెళ్లే మార్గం లేక 24 గంటలుగా ఇబ్బంది పడుతున్నారు విల్లా వాసులు. మొత్తం 212 విల్లాలు ఉన్నాయి. విల్లాలకు వెళ్లే రహదారులు సైతం నీటి ముంపునకు గురయ్యాయి.
విల్లాల చుట్టూ నీళ్లే.. ఎటూ వెళ్లే మార్గం లేక నీటిలోనే ఇబ్బంది పడుతున్నారు విల్లావాసులు. కార్పొరేషన్ అధికారులు స్పందించి సహాయ చర్యలు చేపడుతున్నా.. పై నుంచి వరద వస్తుండటంతో.. నీళ్లు మాత్రం తగ్గటం లేదు. విల్లా వెంచర్ మొత్తం నీళ్లల్లోనే ఉంది. ఇంటి ముందునే కాదు.. చుట్టూ ఎటు చూసినా నీళ్లే. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లే నీళ్లు నిలిచినట్లు చెబుతున్నారు అధికారులు. త్వరగా క్లియర్ చేస్తామని అంటున్నారు.
Also Read:-భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరదలు
ఇప్పటికే మోటార్లు పెట్టి నీటిని బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఓ వైపు వర్షం పడుతూ ఉండటం.. మరో వైపు పై నుంచి వరద వస్తుండటంతో.. వర్షం తగ్గే వరకు నీళ్లు తగ్గే పరిస్థితి లేదని స్పష్టం అవుతుంది.