Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రితో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీలో అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇంతకాలం మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది. అయితే, ఈ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.