వెలుగు, హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, యూసఫ్ గూడ, సికింద్రాబాద్, షేక్ పేట, ముషీరాబాద్, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో దంచికొట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు జల్లులతో మొదలై కొద్దిసేపు గ్యాప్ఇవ్వగా, రాత్రి 7 గంటల తర్వాత మళ్లీ భారీ వర్షం కురుసింది. అత్యధికంగా ఖైరతాబాద్‌లో 3.78 సెంటీ మీటర్లు పడింది.
కృష్ణానగర్‌లో 3.50, శ్రీనగర్ కాలనీలో 3.18, పాటిగడ్డలో 3.08 సెంటీమీటర్ల వాన కురిసింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలు లోతున నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్నిలిచింది. సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీకి 23 ఫిర్యాదులు వచ్చాయి. సిటీలో మరో రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో 6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వాన కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.