ఛత్తీస్ గఢ్ నుండి ఉన్న ద్రోణి... గాలి విచ్చిన్నతి, విదర్భ నుండి మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.. ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి అక్కడక్కడ భారీ గాలులతో కూడా వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు విదర్భ మరియు మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి నుండి 2.1 కిమి ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు ( ఏప్రిల్ 27) బలహీన పడింది.. ఈ రోజు ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఏర్పడింది.. దీని ప్రభావంతో.. రాగల మూడు రోజులు (28, 29, 30వ తేదీల్లో ) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఈ రోజు, రేపు, ఉరుములు మెరుపులు మరియు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనుండగా. ఉరుములు మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30, మే 1 తేదీలలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. గాలిలో తేమ 61 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.