తెలంగాణలో వానలు.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వానలు.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందన్నారు. ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్నిప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు.  హైదరాబాద్ లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. 

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే చాన్స్ ఉందని తెలిపారు. 

టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి దగ్గర మానేరు వాగు పొంగిపొర్లుతుండటంతో భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు భారీ వరదకు కొట్టుకుపోయింది. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం. అయితే మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుందంటున్నారు పబ్లిక్. వెంటనే మానేరువాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.