హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షం పడుతోంది.గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, లింగంపల్లి, బాల్ నగర్, అమర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్,ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అల్వాల్, బాల్ నగర్, చింతల్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులలో కూడిన వర్షం పడుతోంది.
పలు కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. నగర వాసులు వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే బయటకు రావొద్దని సూచించారు.వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
మరో వైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మే 22 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తారు వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.