చండూరు, వెలుగు : వర్షాకాలం ప్రారంభంలోనే చండూరు మున్సిపాలిటీ లో రహదారుల వెంట వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తూ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. కస్తూరిబా స్కూల్ ముందు ఎక్కువగా నీరుని నిలిచిపోవడంతో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నారు.
ఇటీవల చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ పండ్లను అసంపూర్తిగా వదిలేయడంతో డ్రైనేజీ లో నిలిచిన నీరు దుర్వాసనతో, దోమల బెడదతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ప్రధాన రహదారి కావడంతో ఎక్కువగా వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వర్షాకాల ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎన్ని ఇబ్బందులు అందులో పాడాలోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్త నడక నడుస్తున్న రోడ్డు పనులను స్పీడ్ ఆఫ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు.