పంజాగుట్ట ఫ్లైఓవర్​ పై వరద నీరు.. ట్రాఫిక్​ పోలీస్​ ​ కష్టాలు

పంజాగుట్ట ఫ్లైఓవర్​ పై వరద నీరు.. ట్రాఫిక్​ పోలీస్​ ​ కష్టాలు

హైదరాబాద్​ లో చుక్క వర్షం పడిందంటే చాలు.. జనాలు ఇబ్బందులు అంతా ఇంతా కాదు.  ట్రాఫిక్​ లో చిక్కుకుపోవడం.. ఎప్పుడు ఇంటికి చేరుకుంటామో తెలియని పరిస్థితి.. ఇక ఎప్పుడు రోడ్డుపై ప్రజల కష్టాలను పట్టించుకునే ట్రాఫిక్​ పొలీసుల కష్టాలు అంతా ఇంతా కాదు.. వర్షంలో కూడా ట్రాఫిక్​ క్లియర్​ చేస్తుంటారు.  ఈ రోజు( ఏప్రిల్​ 3) హైదరాబాద్​ లో అరగంట పాటు వాన పడింది.  నగరం జలమయం అయింది.  పంజాగుట్ట ఫ్లైఓవర్​ పై విదులు నిర్వహిస్తున్న ఓ పోలీస్​ వరదలో చిక్కుకున్నట్లు  సోషల్​ మీడియాలో ఫొటోలు వైరల్​ అవుతున్నాయి.  పంజాగుట్ట ఫ్లైఓవర్​పై భారీగా వరద నీరు చేరడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్​ నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డాడా..  అన్న విధంగా ఉందని..  ఈ ఫొటో చూస్తే తెలుస్తుంది. 

Also Raed :  తెలంగాణలో పిడుగులు పడే అవకాశం

భారీ వర్షానికి బేగంపేట నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో పుల్ ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూకట్ పల్లి బస్ డిపో ముందు వరద నీరు చేరడంతో అమీర్పేట్ నుంచి కూకట్ పల్లి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ట్రాఫిక్  జామ్ అయింది. మినిస్టర్ రోడ్డు, టోలీచౌకీ, భరత్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం భారీగా వాహనాలు నిలిచిపోయాయి.