వర్షాకాలంలో .. కప్పు చాయ్ .. నోరూరించే ఆలూ స్నాక్స్ .. వేడి వేడిగా ఆలూ బొండా తింటుంటే.. నా సామిరంగా.. ఆ హాయిని చెప్పలేం.. అనుభవించి తీరాల్సిందే. కరకరలాడే పకోరాల నుండి స్పైసీ చాట్స్ .. ఆలూబోండా రుచికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రెసిపీ వంటకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఆలూ బోండా తయారీకి కావాల్సినవి
- అలుగడ్డలు.. ఉడికించినవి - మూడు
- పచ్చిమిర్చి తరుగు... - ఒక టీ స్పూన్
- ఉల్లిపాయ తరుగు - ... ఒక టేబుల్ స్పూన్
- అల్లం తరుగు - ...ఒక టీ స్పూన్
- శెనగపిండి-... ఒక కప్పు
- వాము- ఒక టీ స్పూన్...
- ఉప్పు-... తగినంత
- కారం-... తగినంత
- అల్లం ,వెల్లుల్లి పేస్ట్ -... ఒక టీ స్పూన్
- చాట్ మసాలా-... అర టీ స్పూన్
- జీలకర్ర పొడి ...- అర టీ స్పూన్
- నూనె - ...డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం: శెనగపిండి, ఉప్పూ, కారం, వాము అల్లంవెల్లుల్లి పేస్టేను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిలా కలపాలి. ఉడికించిన అలుగడ్డలు మెదిపి ఒక గి న్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు, తరిగిన అల్లం ,, ఛాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర మాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేగించాలి.