ఈ వానా కాలంలో.. వేడివేడిగా ఈ చైనీస్ వెజ్ ఫుడ్ ట్రై చేయండి.. సూపర్ గా ఉంటుంది..!

ఈ వానా కాలంలో.. వేడివేడిగా ఈ చైనీస్ వెజ్ ఫుడ్ ట్రై చేయండి.. సూపర్ గా ఉంటుంది..!

వర్షాకాలం అంటేనే ఏదో బద్దకం.. మంకుగా ఉంటుంది. వాతావరణం కూడా కూల్ గా ఉంటుంది. ఇలాంటి కాలంలో వేడి వేడిగా చైనీస్ వంటకాల్లో.. వెజ్ ఫుడ్ తింటే ఆ టేస్ట్ వేరు.. ఆ మజా వేరు.. అలాంటి చైనీస్ వెజిటేరియన్ ఫుడ్ వైరటీలు ఏంటో తెలుసుకుందామా.. టేస్ట్ చేద్దామా

హక్కా నూడుల్స్​:  వాతావరణం చల్లగా ఉండి..  సాయంత్రం హక్కా నూడిల్స్​ చైనీస్​ వంటకం ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీనిని కూరగాయలతో తయారు చేస్తారు.  క్యారట్​, బెండకాయ, బీరకాయ, ఇలా ఏ కూరనైనా నూడిల్స్​ మాదిరిగా కట్​చేసి నూనెలో వేయించి.. దానిలో కారం.. ఉప్పు, మసాలా వేయాలి.  ఆతరువాత సన్న కారపూస .. ఉల్లిగడ్డ తరుగు, నిమ్మరసం చల్లి... తింటే వర్షాకాలం.. వేడి వేడిగా తింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుటుంది. 

చిల్లీ పనీర్ :ఇండో-చైనీస్ వంటకాల్లో చిల్లీ పనీర్ సూపర్​ వంటకాల్లో ఒకటి.  స్పైసీ మరియు టాంగీ సాస్‌లో పనీర్ క్యూబ్‌లతో తయారు చేస్తారు.  వీటిపై ఇది పచ్చి బెల్ పెప్పర్స్, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిరపకాయలు, సోయా సాస్ ,  మసాలా దినుసుల మిశ్రమాన్ని  మిక్స్​ చేయాలి . ఇది ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్‌తో కూడా బాగుంటుంది.

వెజ్ మంచూరియన్ : భారతదేశంలో చైనీస్ ఆహర ప్రియులు అధికంగా ఉన్నారు.  న్యుడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ వంటి వాటికీ స్పెషల్ టెస్టుని అద్దారు. మీరు శాకాహారులైతే.. రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఈవెజ్ వెజ్ మంచూరియాను అలాగే చిరు తిండిగా తినవచ్చు.. లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో  కలిపి ఆస్వాదింవచ్చు.

స్ప్రింగ్ రోల్స్: చైనీస్ వంటకాలలో , స్ప్రింగ్ రోల్స్ అంటే సన్నగా చుట్టబడిన స్థూపాకార పేస్ట్రీ లోపల క్యాబేజీ మరియు ఇతర కూరగాయల పూరకాలతో కూడిన రుచికరమైన రోల్స్. చైనాలోని మెయిన్‌ల్యాండ్‌లో స్ప్రింగ్ ఫెస్టివల్ సమయంలో వీటిని సాధారణంగా తింటారు, అందుకే ఈ పేరు వచ్చింది. మాంసం రకాలు, ముఖ్యంగా పంది మాంసం కూడా ప్రసిద్ధి చెందాయి.

షెజ్వాన్ ఫ్రైడ్ రైస్: షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇండో చైనీస్ వంటకాల నుండి ఒక ప్రసిద్ధ ఫ్రైడ్ రైస్ రకం. ఇది చాలా ప్రజాదరణ పొందింది & ఇండో-చైనీస్ రెస్టారెంట్లలో అత్యధికంగా ఆర్డర్ చేయబడింది. సాధారణ ఫ్రైడ్ రైస్ కాకుండా, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అల్లం, వెల్లుల్లి, సోయా సాస్ & రెడ్ చిల్లీ పేస్ట్ యొక్క పగిలిపోయే రుచులతో వేడి & కారంగా ఉంటుంది. 

వేడి మరియు పుల్లని సూప్: వర్షాకాలంలో వేడి వేడిగా ఏదైనా తీసుకోవాలని అంతా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చాయ్.. ఆ తర్వాత కొంత హాట్ అండ్ సోర్ సూప్. ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.  అంతేకాదు ఇది చాలా రుచిగా రూడా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా సులభం. చాలా కూరగాయలతో నిండిన ఈ సూప్ మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది.  ఈ సూప్ పెద్దలు, పిల్లలు ఇద్దరూ చాలా ఇష్టపడతారు. రైనీ సీజన్​లో ఈరెసిపి చాలా టేస్టీగా ఉంటుంది. నూడుల్స్ తో సర్వ్ చేయవచ్చు.

గోబీ మంచూరియన్: రెస్టారెంట్లకు వెళ్లే చాలా మంది మెనూ చూడగానే… ఎర్రగా కనిపించే గోబీ మంచూరియా వైపు మనసు లాగేస్తుంది. పైగా అవి విపరీతమైన టేస్టుతో కరకరలాడతాయి. అందువల్ల అదే కావాలని ఆర్డర్ ఇచ్చేస్తారు చాలా మంది. ఐతే… ఇళ్లలో సొంతంగా దాన్ని తయారుచేస్తే… అది రెస్టారెంట్లలో లాగా అంత టేస్ట్ రాదు. ఎందుకో అని మనం అనుకుంటాం. కారణం కొన్ని సీక్రెట్స్ మెయింటేన్ చేస్తారు. 

హనీ చిల్లీ బంగాళదుంపలు : ఇండో చైనీస్ రెసిపీ హనీ చిల్లీ పొటాటో. తీయతీయగా కారంకారంగా ఉండే ఈ రెసిపీ హనీ చిల్లీ బంగాళదుంపలు. ఇవి అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి . తియ్యగా కారంగా ఉండే సాస్‌లో పూసిన బంగాళాదుంప కర్రలను సూచిస్తాయి. స్టార్టర్స్ లాగా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ లోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది