గత నెల ( మే వరకు) ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో చినుకు పడితే రోడ్లు చిత్తడి చిత్తడి మారతాయి. పల్లెల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. వరద నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి ఈగలు, దోమలు క్రమక్రమంగా వ్యాపిస్తాయి. ఇక అంతే ఆ ప్రాంతంలో జనాలు జ్వరాల బారిన పడతారు. అయితే వర్షాకాలంలో సంభవించే జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. .
వర్షాకాలం మొదలైంది. గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా పడుతున్నాయి. రోడ్లపై నిలిచిపోతున్న వరద నీరు కారణంగా దోమలు, ఈగల బెడద కూడా క్రమ క్రమంగా ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా వర్షాకాంలో సంభవించే జ్వరాల పట్ల చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వర్షంలో తడవడం వల్ల తలనొప్పి, జ్వరం, అసలట, నీరసం, ముక్కు కారడం అంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దోమలు, ఈగల కారణంగా వైరల్ ఫీవర్ లు వ్యాప్తి చెందుతాయి.
ఇంటి చుట్టుపక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్షం నీరు నిలిచిపోయిన చోట దోమల బెడద పెరిగి ఇలాంటి జ్వరాలు సంభవిస్తాయి. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువుగా వైరల్ ఫీవర్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. శరీరం కాస్త అలసటగా ఉన్నా.. తేడా వచ్చినట్టు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
వర్షకాలంలో వచ్చే వ్యాధులు అంటు వ్యాధులు . ఇవి దోమలు, ఈగల వల్ల సంభవించినా కూడా త్వరగా ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫీవర్ వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. అంతేకాదు త్వరగా జ్వరం తగ్గడానికి మంచి సమతుల ఆహారాన్ని తినాలి. తొలుత ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం వంటివి కూడా ప్రారంభమవుతాయి. ఇలాంటి సమస్యలు తలెత్తి నెమ్మదిగా అది జ్వరం వరకు దారితీస్తుంది.
ఇలాంటి వ్యాధులు సంభవించకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వర్షంలో తడవకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ వర్షంలో తడిసినా కూడా ఇంటికి వెళ్లిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలి. వెంటనే వేడి నీళ్లతో స్నానం చేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల జలుబు, జ్వరం వంటివి త్వరగా వ్యాపించకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నవారు అయితే ఇలాంటి చర్యలు తప్పక పాటించాలి.