వర్షాకాలం మొదలైందంటే చాలు.. చాలా మందిని కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి ఒకసారి అటాక్ అయ్యాయంటే ఓ పట్టాన వదిలిపోవు. ఎక్కువగా తడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మం ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా...మృదువైన పాదాలను సొంతం చేసుకోవాలంటే ఈ కాలానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల ఆరోగ్యాన్ని. అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తడిచిన పాదాలకువర్షాకాలంలో కాలిని మొత్తం కప్పి ఉంచే బూట్లూ, చెప్పులకు దూరంగా ఉండాలి. వీటిని వేసుకోవడం వల్ల వర్షంలో తడిచినప్పుడు తేమ బాగా ఎక్కువై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ముందు భాగం కొంచెం వెడల్పుగా ఉండే చెప్పులు, బూట్లకు. ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తడిగా ఉండే బూట్లకు దూరంగా ఉండాలి..
వర్షంలో తడిస్తే పాదాలను గోరువెచ్చని నీళ్ల.. తక్కువ గాఢత ఉన్న షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తేమ లేకుండా మెత్తటి క్లాత్ తో తుడిచి యాంటీ ఫంగల్ పౌడర్ ను రాసుకోవాలి. అలాగే కాలివేలి గోళ్లని క్రమం తప్పకుండా కత్తిరించాలి. లేదంటే వాటిల్లో మురికి, బ్యాక్టీరియా చేరతాయి.
వానాకాలంలో చెప్పులు లేకుండా అస్సలు నడవకూడదు. చెప్పులు లేకుండా తడి నేలమీద నడవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు అలర్జీలు వచ్చే ప్రమాదముంది. వర్షంలో తడిసినప్పుడు ఫ్యూమిక్ రాయితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ లేదాకొబ్బరి నూనె రాసుకోవాలి.
వర్షాకాలంలో లెదర్ చెప్పులకు దూరంగాఉండాలి. ఇవి వర్షం పడితే త్వరగా నానిపోతాయి. అరడానికి చాలా టైం. పడుతుంది. దాంతో ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి త్వరగా వృద్ధి చెందుతాయి. అందువల్ల వాటికి బదులు రబ్బరు చెప్పులు, స్లీవర్స్, శాండిల్స్ ఎంచుకోవడం. మంచిది. ఇవి సులభంగా శుభ్రం చేసుకునే వీలుండటంతో పాటు త్వరగా ఆరిపోతాయి. అలాగే తడిచి, పచ్చిగా ఉన్న షూస్కి దూరంగా ఉండాలి.
పెడిక్యూర్ తరచూ చేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ కాలంలో పెడిక్యూర్ దూరంగా ఉండాలి. తప్పనిసరి అయితే ఇంట్లోనే ప్రయత్నించడం మంచిది. ఇందుకోసం ఒక చిన్నటబ్లో గోరు వెచ్చటి నీళ్లు పోసి దానిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. అందులో పాదాలు పెట్టి స్క్రబ్బర్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. గోర్లని శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించొచ్చు. తరువాత. పాదాలను టబ్‌లో నుంచి బయటకు తీసి తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకుంటే ఇంట్లోనే పెడిక్యూర్ అయిపోతుంది..
కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించడంలో కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొబ్బరి నూనె(Coconut Oil) ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతాయంటున్నారు. ఇందుకోసం పాదాలలో ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా నీటితో కడుక్కొని అవి ఆరాక.. అలర్జీ ఉన్న చోట కోకోనట్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి.
అలోవెరా జెల్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అలోవెరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా పనిచేస్తాయి. ఇందుకోసం.. కాస్త అలోవెరా జెల్ తీసుకొని ఇన్ఫెక్షన్ సోకిన చోట అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆపై గోరు వెచ్చని వాటర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఫాలో అయితే వర్షాకాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.