వర్షాకాలంలో ముఖ్యంగా గర్భిణీలకు అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.వెచ్చగా,చురుకుగా ఉండటం వల్ల ప్రసవం ప్రశాంతంగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు .పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే లేచి కాస్త వ్యాయామం చేయాలి, సరైన సమయానికి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి ఇలా చేయడం వల్ల గర్భిణీ తో పాటు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. వర్షాకాలంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. .
వర్షాకాలంలో సాధారణంగానే ఉదయం పూట నిద్ర లేవాలంటే చాలామంది బద్దకిస్తుంటారు. ముఖ్యంగా గర్భిణులు నిద్ర లేచేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఇలా చేయడం సరికాదట..
తగినంత నీరు తాగాలి : వర్షాకాలంలో సాధారణంగా దాహం అనిపించదు. అయినప్పటికీ.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల వాటర్ తాగాలి. కడుపులో ఉమ్మనీరు ఏర్పడటం కోసం నీరు అవసరం. అలాగే, శరీరంలో రక్తం స్థాయి పెరగడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.వేడి చేసి వడగట్టిన నీటిని తాగాలి
టీ, కాఫీ తగ్గించాలి: టీ, కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే.. టీ, కాఫీ ఎక్కువగా తాగొద్దు. టీ కి బదులుగా సూప్‌లు, కొబ్బరి నీళ్లు, తాజా జ్యూస్‌లు తాగాలి.
పరిశుభ్రంగా ఉండాలి: వర్షాకాలం ముఖ్యంగా అతిసార వ్యాధి, విష జ్వరాలు, ప్రబలే అవకాశం ఉంది ముఖ్యంగా దోమ కాటుకు గురి కాకుండా ఉండాలి ,వర్షంలో తడవకూడదు.. ఏ వైరల్ జబ్బులు రాకుండా సబ్బు, నీటితో చేతులు సరిగ్గా కడగాలి. అవసరమైతే హ్యాండ్ శానిటైజర్ వాడాలి. అనారోగ్య వ్యక్తులకు దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. సమయానికి మందులు తీసుకోవాలి.
చురుకుగా ఉండండి: డాక్టర్ల సలహా మేరకు క్రమం తప్పకుండా సున్నితమైన యోగా చేయాలి. సాధారణ ఫిట్‌నెస్ నియమావళి గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. వెన్నునొప్పి, అలసట వంటి అనేక సాధారణ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇది గర్భధారణ మధుమేహం, ఒత్తిడిని తగ్గించడం.. ప్రసవానికి అవసరమైన శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తగినంత నిద్రతో పాటు.. ఉదయం వేళ సూర్య కిరణాలకు కాసేపు కూర్చోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది.
చర్మ సంరక్షణ: పొద్దున్నే నీరసం, ఆహార మార్పులు, చర్మ సంరక్షణ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను వాడాలి.
బయట తినకూడదు: బయటి ఆహారాన్ని అసలు తీసుకోవద్దు . ఇంట్లో ఆహారాన్ని వేడివేడిగా తినాలి. తప్పనిసరిగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, చికెన్, గుడ్లు, చేపలు, గింజలు, మొలకలు చేర్చుకోవాలి. బరువు పెరగడానికి నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి స్వీట్లు, నూనె అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.