వర్షాకాలంలో  బైక్​ వాడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

వర్షాకాలంలో  బైక్​ వాడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

అసలే వర్షాకాలం..  వానలు పడుతుంటాయి.  రోడ్లు జలమయంగా మారతాయి.  ఇక  వర్షాకాలంలో బైక్ లు  తరచూ రిపేర్లు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వానాకాలం బండి బయటకు తీస్తే ఈ టిప్స్ గుర్తుంచుకోవాలి..ఏ ఏ కాలాలలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుంటే టు వీలర్ మెయింటైన్ చేయడం చాలా సులువు అవుతుంది.ముఖ్యంగామరి ఈ వర్షా కాలంలో బైక్ మెయింటేనెన్స్ ఎలా చేస్తే ఎక్కువ రిపేర్ రాకుండా ఉంటుందో తెలుసుకుందాం. . 

కంప్యూటర్​ యుగంలో జనాలు సుఖానికి అలవాటు పడ్డారు.  అసలు నడకే మానేశారు.  చాలామంది పొద్దున్నే పాల ప్యాకెట్​ కు  బైక్​పైనే వెళుతున్నారు.  ఇక వర్షాకాలం వచ్చిదంటే బైక్​కు స్టాటింగ్​ ట్రబుల్స్​ ఉంటాయి.   అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే అలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు బైక్​ మెకానిక్​లు . ప్రజలు ఈ రోజులలో ఎక్కడికి వెళ్లాలన్న వాహనం అనేది తప్పనిసరిగా అవసరం. కానీ చాలా మంది దాన్ని మెయింనేన్స్సీ చేయక పోవడం వలన తొందరగా రిపేర్​ కు వస్తుంది.

రోజూ మనకు ఎంతో ఉపయోగపడుతున్న వాహనాన్ని కొంతమంది అసలు పట్టించుకోరు.  పొద్దున్నే లేవడం.. స్టాట్​ చేసుకొని వెళ్లడం.. అంతా ఇంతో ఇంధనం పోయడం.. మళ్లీ సాయంత్రం వచ్చి పార్క్​ చేయడం ఇలా చేస్తుంటారు.  కాని నిత్యం    మన వాహనాన్ని మనమే స్వయంగా పరిశీలించి, జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో బైక్ సెంటర్ స్టాండ్ వేస్తే, ప్లగ్‌లోకి వాటర్ చేరుకోదు. అదే విధంగా పిటి క్యాప్, ట్యాంక్ కవర్ లేకపోతే వర్షపు నీరు పొయ్యి స్టార్టింగ్ ట్రబుల్ వస్తుందని మెకానికులు చెప్తున్నారు.

బండి టైర్లు.. ఇంజన్​ నుంచి చైన్ లింక్​ ఏర్పడి  రయ్​ రయ్​ మని రోడ్డుపై పరిగెడుతుంది.  చైన్​ సరిగా లేకపోతే మధ్యలో ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఒకవేళ అలా మధ్యలో ఆగిందా.. ఇక అంతే మనం పడే కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు.  అందుకోసం చైన్​ లో ప్లాబ్లమ్​ ఉందని గమనిస్తే వెంటనే  చైన్​ ఆయిల్​ వేయాలి.  అదే రైడ్​కు వెళ్లి వచ్చిన తరువాత వెంటనే ఆయిల్​ వేస్తే వేడిగా ఉండటం వల్ల లింక్ లన్నింటికి ఆయిల్​ త్వరగా చేరి.. చైన్​ లైఫ్​ పెరుగుతుంది. ఇక బైక్​ ఇంజన్లో ఉండే ఆయిల్​స్థాయిలు తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి.

వర్షా కాలంలో బైక్ లోకి నీరు వెళ్లి  ప్లగ్ కు  పవర్ సప్లై రాకపోవడంతో  బండి స్టాటింగ్ ప్రాబ్లమ్ వస్తుంది.  ప్లగ్​ కు ఎప్పుడైతే పవర్​ రాదో అప్పుడు స్టాట్​ కాదు.  బైక్ తడవడం వలన కార్బన్ వస్తుంది దీనివలన కూడా బైక్ ట్రబుల్ ఇస్తుంది.. కాబటి ఇంజన్ ప్లగ్ తీసి ఒకసారి పొడి బట్టతో తుడిచి మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. చిన్న ప్రాబ్లమ్ ఐనా కూడా వెంటనే మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలి. వర్షాకాలంలో ఎక్కువుగా ఇంజన్ ప్రాబ్లమ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.   బైక్ ను బయట ఉంచడం ద్వారా వాటి ఇంజన్లోకి వాటర్ వెళ్లి బైక్స్ ఎక్కువగా చెడిపోతాయి.  ప్లగ్ ద్వారా బండి లోపలికి వాటర్ వెళ్లి బండికి ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుందని అన్నారు. కాబట్టి వర్షాకాలంలో వీలైనంతవరకు బైకును తడవకుండా కాపాడుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవంటున్నారు.