వానాకాలం .. అల్లం వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..

వానాకాలం వ్యాధులు ముసిరే కాలం. చిటపట చినుకులు ఆనందాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తాయి. పరిసరాలు బురదమయంగా మారడం, వాన నీరు నిలిచిపోవడం వల్ల అనేక జబ్బులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం వంటివి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే వానాకాలంలో  ఆహారం పరంగానూ, ఆరోగ్యం పరంగానూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.. 

వర్షాకాలం వస్తుందంటేనే మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. అయితే ఆహారంలో తరచుగా అల్లాన్ని తీసుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు అని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు. అయితే ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ మీద ఆధారపడే నేటి తరానికి ఈ విషయం మీద పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే ఓసారి అల్లంతో కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.

ఇవి కూడా చదవండి:తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

దీనిని నిత్యం ఆహారంలో వాడటం వల్ల మనకి తెలియకుండానే సగం రోగాలు నయమవుతాయి. అల్లంలో సహజంగా జంజిరల్ అనే పదార్ధం  ఉంటుంది.  ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి డైజేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అల్లం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. గుండెలో మంటగా కనిపించినప్పుడు అల్లం టీ తీసుకోవటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే.  ఆర్థరైటిస్ లక్షణాల చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.

రోజు ఆహారంలో అల్లం తీసుకోవడం ద్వారా నొప్పి,- వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక అల్లంని టీ రూపంలో మనం తీసుకోవచ్చు .  కూరలు వండేటప్పుడు అల్లాన్ని సన్నగా తరిగి ముక్కలు వేస్తే  తగిన రుచితో పాటు, శరీరంలోపల క్లీనింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇక అల్లం జామ్ చేసి పిల్లలకి పెడితే..  వాళ్లు ఇష్టంగా దీన్ని తింటారు.  అల్లం పచ్చడి అల్లం ఊరగాయ పెట్టుకొని సంవత్సరం మొత్తం మన ఆహారంలో ఉపయోగించుకోవచ్చు.  రక్తాన్ని పలుచన చేసే మందులను వాడుతున్నట్లయితే అల్లం మరింత రక్తం పలుచబడుతుంది. 

అల్లం శరీరం యొక్క దాదాపు అన్ని ముఖ్యమైన విధులు కోసం ఒక ఔషధయుత పోషకాహారం వంటిది.  ఆయుర్వేద వైద్యంలో దీని  ప్రయోజనాలను  లెక్కించటం కష్టం. ఇది ఒక యాంటిమెటిక్ (వికారం మరియు వాంతి ఆపు చేస్తుంది), యాంటీటస్యివ్ (దగ్గుని అణిచివేస్తుంది), యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయాల్ మరియు అద్భుతమైన ఒక యాంటీ ఆక్సిడెంట్. అదనంగా, అల్లం  హైపోగ్లైసీమిక్ (రక్తoలోని చక్కెరను తగ్గిస్తుంది) మరియు హైపోలిపిడెమిక్ (కొలెస్టరాల్ తగ్గిస్తుంది) వంటి లక్షణాల వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.