వానాకాలంలో సాయంత్రం తినే శ్నాక్స్ చాలాస్పెషల్, అలాగెండుకంటే.. అదంతే. ఒక పక్క వాన ముసురు, మరో పక్క చల్లటి వాతావరణం. ఈ రెండూ కలిసి వేడివేడిగా, స్పైసీగా తినమని రుచికరమైన సిగ్నల్స్ ఇస్తుంటాయి. అలాగని బయటి తిండి తింటే... అప్పుడు పొట్ట ఇచ్చే సిగ్నల్స్ కూడా బాగానే ఇబ్బంది పెడతాయి. అలాకాకుండా ఉండాలంటే ఇంట్లోనే చేసుకుని తినడం బెటర్ కదా. అయితే... అవి కూడా రెగ్యులర్ చేసుకునే పకోడి, బజ్జీ, సమోసాల్లాంటివి కాకుండా. వెరైటీగా ఉండాలి. వెరైటీ రుచులతో, హెల్దీ శ్నాక్స్ తినాలంటే వీటిని ట్రై చేసి తినండి.
రాజ్మా పల్లి టిక్కీ తయారీకి కావలసిన పదార్దాలు
- రాజ్మా.... అర కప్పు
- వేయించిన పల్లీగింజల పొడి- ....అర కప్పు
- ఉడికించిన ఆలుగడ్డలు .... మూడు
- ఉల్లిపాయ తరుగు.... - ఒకటి,
- బ్రెడ్ ముక్కలు...- ఒక కప్పు
- గోధుమ పిండి -.... ఒక టీ స్పూన్
- కొత్తిమీర- ...కొద్దిగా
- నూనె- ...రెండు టేబుల్ స్పూన్లు
- కరివేపాకు....- రెండు రెమ్మలు
- ఉప్పు- ...తగినంత
- నిమ్మరసం-... ఒక టీ స్పూన్..
- వచ్చిమిర్చి....- నాలుగు
తయారీ విధానం : మిక్సీజార్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసి పే గ్రైండ్ చేయాలి. రాజ్మాని వానబెట్టి కచ్చాపచ్చాగా మిక్సిపట్టి ఒక బౌల్ లో కి తీసుకోవాలి. అందులో వేయించిన పల్లీల పొడి, ఉల్లిపాయ తరుగు, గోధుమ పిండి బ్రెడ్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాడు. ఉడికించిన ఆలుగడ్డలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కిలా ఒత్తి నూనెలో రెండు వైపులా కాల్చాలి. అంతే రాజ్మా పల్లీ టెక్కీరెడీ.. ఇది తింటానికి చాలా రుచికరంగా ఉంటుంది.
మసాలా పావ్ బాజీ వంటకం తయారీకి కావాల్సినవి
- పావ్ లు... నాలుగు
- ఉడికించిన ఆలుగడ్డలు ...- రెండు,
- క్యాలిఫ్లవర్ తరుగు - ....అర కప్పు
- క్యారెట్ ముక్కలు....- పావు కప్పు
- ఉడికించిన బీన్స్ తరుగు- ...పావు కప్పు
- క్యాప్సికం తరుగు- ....ఒక టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ తరుగు....- ఒక టేబుల్ స్పూన్
- వెల్లుల్లి తరుగు- ....ఒక టీ స్పూన్
- ఉప్పు...-తగినంత
- కారం- ....తగినంత
- జీలకర్రపొడి....- ఒక టీ స్పూన్
- పాప్ బాజీ మసాలా....- ఒక టీ స్పూన్
- వెన్న- ....మూడు టేబుల్ స్పూన్లు
- చాట్ మసాలా-... ఒక టీ స్పూన్
- సన్న కారప్పూస... - కొద్దిగా
- నిమ్మరసం....- ఒక టీ స్పూన్
- టొమాటో తరుగు... - రెండు టీ స్పూన్లు
- కొత్తిమీర....- కొద్దిగా
తయారీ విధానం: పాన్ లో వెన్న వేడిచేసి ఉల్లిపాయ తరుగు, తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు వేసి వేగించాలి. అందులో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన అలుగడ్డ, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ చేసి బాగా కలిపి, గరిటెతో మెత్తగా మెదపాలి. తర్వాత పావ్ బాజీ మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి . ఇప్పుడు పావ్లని ముక్కలుగా కట్ చేసి వెన్నలో వేగించాలి. అందులో జీలకర్ర పొడి, పావ్‌బాజీ మసాలా, చాట్ మసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత బాజీలను మిశ్రమంలో వేసి కాసేపు వేయించి స్టవ్ మీదనుంచి కిందకు దింపాలి. ఆపై నిమ్మ రసం, సన్నకారపూస, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పావ్ బాజీ మసాలా తినడానికి రెడీ......
చికెన్ బిస్కెట్ బైట్ తయారీకి కావాల్సినవి
- చికెన్ కీమా.. ఒక కప్పు
- నూనె -... తగినంత
- ఉల్లిపాయ తరుగు-... ఒక టేబుల్ స్పూన్
- క్యారెట్ తురుము... - ఒక టీ స్పూన్
- క్యాప్సికం తరుగు...- ఒక టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి... ఒక టీ స్పూన్
- చిల్లిఫిక్స్- ...ఒక టీ స్పూన్
- మిరియాల పొడి...- అర టీ స్పూన్
- ఉడికించిన ఆలుగడ్డల గుజ్జు...- రెండు టేబుల్ స్పూన్లు
- చీజ్ ముక్కలు...- రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర....- కొద్దిగా
- షుగర్ లెస్ బిస్కెట్స్ ...కావాల్సినన్ని
- గుడ్లు- ...రెండు
- ట్రెడ్ పొ...డి కావాల్సినంత
- పాలు..-- ఒక టీ స్పూన్
- ఉప్పు -.. తర్కంత
తయారీ విధానం: పాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. అందులో క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము.చికెన్ కీమా కూడా వేసి వేగించాలి. తర్వాత ఆ మిశ్రమంలో మిరియాల పొడి, చిల్లీ ప్లేక్స్, గరం మసాలా పొడి, ఉడికించిన అలుగడ్డల గుజ్జు కూడా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర, ఉప్పు, చీజ్ ముక్కలు వేయాలి. చీజ్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన వేసి కొద్దిగా పాలు, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత మరొక పాన్ లో నూనె వేసి అది వేడెక్కే లోపల ఒక బిస్కెట్ ను తీసుకుని ..తయారుచేసుకున్న బీమా స్టఫ్ పెట్టాలి. దాని పైన ఇంకో బిస్కెట్ పెట్టి గుడ్డు మిశ్రమంలో ముంచి ట్రేడ్ పౌడర్ అది నూనెలో వేగించాలి. ఇక అంతే ఇది తింటే టేస్ట్ అదుర్స్. . .