ప్రేమంటే ఇది కదా.. : కిడ్నీ ఇచ్చి అన్నయ్యను కాపాడుకున్న చెల్లెలు

ప్రేమంటే ఇది కదా.. : కిడ్నీ ఇచ్చి అన్నయ్యను కాపాడుకున్న చెల్లెలు

రక్షా బంధన్ ..  రక్షణ కోరిన చెల్లెలికి రక్షకవచంగా నిలుస్తానని అభయమివ్వడమే రాఖీ పండగ పరమార్థం. అంతే కాదు  తనకు రక్షణగా నిలిచే సోదరుడు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిత్య సంతోషంతో జీవించాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది సోదరి.  ఒకరికి  ఆపద వస్తే మరొకరు ఆదుకోవడం..ఒకరికొకరు రక్షగా ఉండడం అన్నా చెల్లెల్ల అనుభందానికి ప్రతీక. 

అయితే ఈ నిర్వచనాన్ని అక్షర సత్యం చేసింది చత్తీస్ ఘడ్ లో  ఓ సోదరి.  రాయ్‌పూర్‌లోని షీలాబాయి పాల్ తన 48 ఏళ్ల సోదరుడు ఓంప్రకాష్ ధన్గర్ ప్రాణాలను కాపాడేందుకు రాఖీ పండుగ రోజు తన కిడ్నీని దానం చేసి అన్నా చెల్లెళ్ల  అనుభందాన్ని తెలియ జేసింది. షీలాబాయి పాల్ తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. రక్షా బంధన్ నాడు అతడిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేశానని చెప్పింది.

ALSO READ :వామ్మో ..ఇదెక్కడి ఆచారంరా బాబూ.. కత్తుల నిచ్చెన ఎక్కి దేవతను ప్రార్థిస్తారు.. 

ఆమె సోదరుడు ఓంప్రకాష్ ధన్గర్ కు మే 2022లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.  ఒక కిడ్నీ 80%, మరొకటి 90% దెబ్బతింది. అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పగా.. షీలాబాయ్ పాల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన సోదరుడికి  కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించింది. సెప్టెంబర్ 3న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఓంప్రకాష్, షీలాబాయి ఇద్దరూ ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నారు.  శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు.