
పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్లలో అమలుకాని హమీలు, ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిలో 10 శాతం కూడా మెదక్ నియోజకవర్గంలో జరగలేదన్నారు. ప్రతి గ్రామం తిరిగి బీఆర్‌ఎస్ మోసాలను ప్రజలకు వివరిస్తామమన్నారు. హైకమాండ్ ఎవరికి టికెట్ఇచ్చినా వారితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.