- ప్రతిరంగంలోనూ డెవలప్మెంట్ కనిపిస్తున్నది: ప్రధాని మోదీ
- గత పదేండ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం
- రైసింగ్ రాజస్థాన్ సమిట్‌లో ప్రసంగించిన ప్రధాని
జైపూర్: రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ మంత్రంగా భారత్ చేసిన డెవలప్మెంట్అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. గత పదేండ్ల కాలంలో దేశంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. ఇంతకుముందు పదో స్థానంలో ఉండేదని తెలిపారు. పదేండ్లలో దేశ ఎగుమతులు రెట్టింపయ్యాయని, ఎఫ్‌డీఐలు డబుల్ అయ్యాయని వెల్లడించారు.
సోమవారం మోదీ ‘ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ 2024’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి ఇన్వెస్టర్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాడని తెలిపారు. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురైనా ఎకానమీ పటిష్టంగా కొనసాగాలంటే దేశంలో భారీ తయారీ బేస్ ఉండాలని అభిప్రాయపడ్డారు.
భారత్‌లాంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడం చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్‌లో యువ జనాభా అధికంగా ఉన్నదని, దేశంలో అత్యధిక మంది స్కిల్కలిగిన యూత్ ఉన్నారని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతిక ప్రజాస్వామ్య ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి ఎలా మేలు చేస్తుందో భారత్ చూపించిందని అన్నారు. ఇది టెక్, డేటా నడిపించే శతాబ్దం అని పేర్కొన్నారు. గత పదేండ్లలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని, డిజిటల్ చెల్లింపుల్లోనూ భారీగా పుంజుకొన్నదని తెలిపారు.
స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు రాజస్థాన్ అభివృద్ధి, సంస్కృతిని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం వికాస్భీ విరాసత్ భీ (అభివృద్ధితోపాటు వారసత్వ పరిరక్షణ) మంత్రంగా పనిచేస్తున్నదని తెలిపారు. రాజస్థాన్‌లోని పరిస్థితులు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని, నైపుణ్యాలను వేగంగా పెంపొందించుకుంటున్నారని చెప్పారు.
హర్యానాలో శరవేగంగా అభివృద్ధి
బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక హర్యానాలో అభివృద్ధి శరవేగంగా జరిగేలా కృషిచేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. రక్షణ, బ్యాంకింగ్, వ్యవసాయంసహా వివిధ రంగాల్లో మహిళల సాధికారతకోసం కేంద్ర ప్రభుత్వం గత పదేండల్లో అనేక చర్యలు తీసుకున్నదని చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్ఐసీ ‘బీమా సఖి యోజనా’ను ప్రారంభించిన అనంతరం, మోదీ మాట్లాడారు.
హర్యానా డెవలప్మెంట్కు బీజేపీ సర్కారు మూడు రెట్ల వేగంతో పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలో మహిళా సాధికారత కోసం కేంద్ర సర్కారు కృషిచేస్తున్నదని, ఉద్యోగాలు పొందడంలో వారికి ఉన్న అవరోధాలను అధిగమించేలా చేస్తున్నామని చెప్పారు. గత పదేండ్లలో సెల్ఫ్హెల్ప్గ్రూప్స్కు రూ.8లక్ష కోట్ల సహాయం చేసినట్టు వెల్లడించారు. తాము 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకూ 1.15 కోట్ల మందిని లక్షాధికారులను చేశామని వివరించారు.