పండుగ పూట ఆర్టీసీ ధరలు పెంచడం దుర్మార్గం: ఎమ్మెల్యే హరీశ్ రావు

పండుగ పూట ఆర్టీసీ ధరలు పెంచడం దుర్మార్గం: ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: పండుగ పూట ఆర్టీసీ టికెట్ ధరలు విపరీతంగా పెంచి.. సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. జేబీఎస్ నుంచి సిద్దిపేటకు రూ.140 టికెట్​తో వెళ్లిన ప్రయాణికుడు.. తిరుగుప్రయాణంలో రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్ చార్జీ సాధారణ రోజుల్లో రూ.300 ఉంటే, పండుగ వేళ రూ.420కి పెంచిందన్నారు. ప్రజాపాలన అంటే బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ చార్జీలు పెంచి ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా? అని సీఎం రేవంత్​ను హరీశ్​ప్రశ్నించారు.