కుట్రలు సహించం: నిరసన పేరుతో ఆజాదీ అంటే దేశ ద్రోహమే

కుట్రలు సహించం: నిరసన పేరుతో ఆజాదీ అంటే దేశ ద్రోహమే

నిరసన తెలిపే ముసుగులో ఆజాదీ అంటూ నినాదాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అలాంటి స్లోగన్స్ ఇచ్చిన వాళ్లు దేశ ద్రోహం అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అవగాహన కల్పించడానికి కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘భారత దేశ మట్టిలో బతుకుతూ.. ఈ దేశంపైనే కుట్రలు చేస్తూ ఉంటే సహించబోం. నిరసన పేరు చెప్పి ఆజాదీ అంటూ నినాదాలిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ హెచ్చరించారు ఆదిత్యనాథ్.

సీఏఏ గురించి అవాస్తవాల ప్రచారం జరుగుతోందని అన్నారు యూపీ సీఎం. ఈ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదని చెప్పారు. ఏ ఒక్క పౌరుడూ తన సిటిజన్‌షిప్ కోల్పోవడం జరగదన్నారు. పొరుగు దేశాల్లో మత హింస ఎదుర్కొంటున్న వారికి భారత పౌరసత్వం ఇచ్చి వారు గౌరవంగా జీవించే హక్కు కల్పించేందుకే ఈ చట్టం తెచ్చామని చెప్పారు యోగి ఆదిత్యనాథ్.

More News:

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది: అర్జున్ రెడ్డి మూవీ స్టార్

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

అందమైన అమ్మాయితో ప్రేమ పెళ్లి.. ఫేస్‌బుక్‌లో పాపులారిటీ చూసి అనుమానంతో హత్య