4వ రోజు రైతుబంధు నిధులు 1,131 కోట్లు

  • 6.64 లక్షల మంది ఖాతాల్లో జమ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 6,64,717 మంది రైతుల ఖాతాల్లో నాలుగో రోజు రైతుబంధు రూ.1,131 కోట్లు  జమ చేశారు. 

దీంతో ఇప్పటి దాకా రాష్ట్రవ్యాప్తంగా  రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతుబంధు మొత్తం రూ.4,377.42 కోట్లుకు చేరుకుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌రెడ్డి వెల్లడించారు.11 విడతతో  రైతు బంధు అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.