- రక్తదానంలో ప్రజల భాగస్వామ్యం కీలకం: గవర్నర్
హైదరాబాద్, వెలుగు: బ్లడ్ డొనేషన్‌ను ఎంకరేజ్ చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని గవర్నర్ తమిళిసై అన్నారు. రక్తదానంపై పబ్లిక్‌లో అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించి అవేర్ నెస్ కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. బుధవారం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించి, ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి గవర్నర్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బ్లడ్ డొనేట్ చేయడమంటే జీవనదానమేనని గవర్నర్ అన్నారు.
ఒక్కరు బ్లడ్ ఇస్తే ముగ్గురికి ఉపయోగపడుతుందన్నారు. 300 ఎంఎల్ బ్లడ్ డొనేట్ చేస్తే 15 రోజుల్లో కొత్త బ్లడ్ తయారవుతుందని గవర్నర్ గుర్తు చేశారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరిస్తూ రక్త దానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా టీసీఎస్, ఎస్బీఐ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు రెడ్ క్రాస్ కు 7,320 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. మొత్తం 51వేల యూనిట్ల బ్లడ్‌ను రెడ్ క్రాస్ సభ్యులు సేకరించారు. ప్రతిఒక్కరు సంవత్సరంలో ఒకసారైనా రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలు కావాలని గవర్నర్ కోరారు.