ఓబీసీ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి: హన్స్ రాజ్ గంగారాం ఆహిర్

జ్యోతినగర్,వెలుగు: ఓబీసీ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్​ హన్స్ రాజ్ గంగారాం ఆహిర్ ఆదేశించారు. సోమవారం రామగుండంలో ఆయన పర్యటించారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్ లో ఓబీసీ రిజర్వేషన్ అమలు తీరుపై సంబంధిత అధికారులతో ఎన్టీపీసీ మిలియన్ హాల్ లో సమీక్షించారు.  జిల్లాలో ఓబీసీ శాతం,  అక్షరాస్యత,  సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ, విద్యార్థులకు ప్రి, పోస్ట్​ మెట్రిక్​ స్కాలర్ షిప్​, రైతులు, వ్యవసాయ కూలీల వివరాలు, నిరుద్యోగులు మొదలగు వివరాలను తెలుసుకున్నారు.  

విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికెట్ జారీ విధానాలపై ఆరా తీశారు.  జీపీల్లో ఓబీసీ రిజర్వేషన్ అమలు, సర్పంచుల వివరాలు తెలుసుకున్నారు.  సమావేశంలో బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి,  డీఆర్డీవో శ్రీధర్, డీఈవో మాధవి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,  అధికారులు , తదితరులు పాల్గొన్నారు.