కానిస్టేబుల్ అభ్యర్థి రాజ్ కుమార్ ఆత్మహత్య

కానిస్టేబుల్ అభ్యర్థి రాజ్ కుమార్ ఆత్మహత్య

ఒంటిపై ఖాకీ బట్టలు వేసుకుని సమాజ సేవ చేయాలనే ఆ యుకువడి కల నెరవేరలేదు. ఆశయ సాధనలో ఓటమి పాలయ్యానని కుంగిపోయిన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మూడు మార్కులు తక్కువ వచ్చాయనే మనస్థాపంతో వరంగల్ జిల్లాకు చెందిన జక్కుల రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.  

ఐనవోలు మండలం సింగారంకు చెందిన జక్కుల రాజ్ కుమార్ చిన్నతనం నుంచే పోలీస్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడ్డాడు. రేయింభవళ్లు చదివాడు. అయినా మూడు మార్కుల తేడాతో క్వాలిఫై అవ్వలేదు. తీవ్ర నిరాశకు గురయ్యాడు. బాధతో గుంకిపోయాడు. తన కల కండ్ల ముందే కల్లలు కావడాన్ని తట్టుకోలేకపోయాడు. తాను కానిస్టేబుల్ అవ్వలేకపోయాననే బాధతో సూసైడ్ చేసుకున్నాడు.