రాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు

రాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు

అశ్లీల వీడియోలు తీసి సొమ్ము చేసుకుంటున్నారనే కేసులో రాజ్ కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అడల్ట్ వీడియోలను క్రియేట్ చేసి వాటిని మొబైల్ యాప్‌ల ద్వారా సర్కులేట్ చేస్తున్నారని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ఆ వీడియోలు ప్రసారం చేసి అక్రమంగా సంపాధించారని మనీలాండరింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం రాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీసులపై రైడ్స్ చేశారు. ఆ వీడియోలను హాట్ షార్ట్ అనే మొబైల్ అప్లికేషన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారని పోలీసుల విచారణ కొనసాగుతుంది. శ్రీ కుంద్రా గతంలో హాట్‌షాట్‌లు అనే అప్లికేషన్ ద్వారా అశ్లీల చిత్రాలు మానిటైజ్ చేయడంలో కీలక సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. 

2021లో ముంబై పోలీసులు అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారనే కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అరెస్టు చేయబడ్డారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2024 జనవరిలో ED వారి రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గెయిన్ బిట్‌కాయిన్ స్కామ్‌తో సహా అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి వాటిని సంపాదించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 

Also Read:-అదానీ ఇష్యూపై ఉభయసభల్లో ఆగని రచ్చ..డిసెంబర్ 2కు రాజ్యసభ వాయిదా