బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా మనీలాండరింగ్ తో పాటూ ఇతర కేసులలో అభియోగాలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికొచ్చాడు. అంతేగాకుండా మనీలాండరింగ్ కేసులో శిల్పా శెట్టి దంపతులకి చెందిన పలు ఆస్తులు, డబ్బు ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈడీ రైడ్స్ విషయంపై రాజ్ కుంద్రా స్పందించాడు.
ఇందులోభాగంగా తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని కొందరు కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. అలాగే తన భార్య శిల్పా శెట్టి చాలా మంచిదని కానీ కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తన భార్యకి ఈ కేసులకి ముడిపెడుతూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆపాలని కోరాడు.
Also Read :- సూర్య సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ పాటిల్ ఈ విషయంపై స్పందిస్తూ రాజ్ కుంద్రా మనీ లాండరింగ్, అశ్లీల కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అన్నాడు. అలాగే రాజ్ కుంద్రా కూడా గత నాలుగేళ్లుగా పోలీసుల విచారణకి సహకరిస్తున్నాడని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా గతంలో రాజ్ కుంద్రా "ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించి అశ్లీల చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించడంతోపాటూ ఈ కంటెంట్ ని అప్లోడ్ చెయ్యడానికి హాట్‌షాట్స్ అనే యాప్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు కోర్టుకి తెలిపారు. అంతేగాకుండా రాజ్ కుంద్రా మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులతో కలసి మనీలాండరింగ్ కి పాల్పడ్డాడని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.