జన్వాడ ఫామ్ హౌస్ కేసు: రాజ్ పాకాలను 8 గంటలు విచారించిన పోలీసులు

జన్వాడ  ఫామ్ హౌస్ కేసు: రాజ్ పాకాలను  8 గంటలు విచారించిన పోలీసులు

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో  కేటీఆర్ బామ్మర్ది  రాజ్ పాకాల విచారణ ముగిసింది. అక్టోబర్ 30న 8 గంటల పాటు రాజ్ పాకాలను విచారించారు మోకిల పోలీసులు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు..  విచారణ మధ్యలో  రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌస్ కు తీసుకువెళ్లారు. సుమారు  గంట పాటు ఫాంహౌస్ లో సోదాలు చేశారు.  విజయ్ మద్దూరి ఫోన్ చుట్టూ  విచారణ కొనసాగింది.  గతంలో జరిగిన పార్టీలు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై అరా తీశారు పోలీసులు. విచారణలో రాజ్ పాకాల స్టేట్మెంట్ ను  రికార్డ్  చేశారు.  విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ పాకాలను విచారించారు పోలీసులు. 

ఏ1గా రాజ్ పాకాల

రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం జన్వాడ పరిధిలో అక్టోబర్ 26న  కేటీఆర్‌‌‌‌‌‌‌‌ బామ్మర్ది  రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాలకు చెందిన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌లో పార్టీ జరిగింది.‌‌ అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఫారిన్​లిక్కర్​వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్​ కింద కూడా కేసు ఫైల్​చేశారు. ఫామ్​హౌస్లో నిర్వహించిన సోదాల్లో 12  ఫారిన్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌..  ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్.. 11 కేఎఫ్‌‌‌‌‌‌‌‌ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ALSO READ | కేటీఆర్ బామ్మర్ది కేసులో కొత్త ట్విస్ట్.. జన్వాడ ఫామ్ హౌస్కు ఎవరొచ్చారో తెలుసా..?

పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు.  22 మందికి డ్రగ్స్​ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్‌‌‌‌‌‌‌‌ మద్దూరి  కొకైన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు నిర్ధారణయింది.  ఎన్డీపీఎస్​యాక్ట్​, తెలంగాణ గేమింగ్ యాక్ట్  కింద కేటీఆర్​ బామ్మర్ది రాజ్​ పాకాల (50), విజయ్​ మద్దూరి (55), ఫామ్​హౌస్​ మేనేజర్​ కార్తీక్​(30)పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇందులో ఏ1గా రాజ్​పాకాల, ఏ2గా విజయ్​మద్దూరి, ఏ3గా కార్తీక్ను చేర్చారు. 

ALSO READ | రాజ్ పాకాల సమక్షంలోనే పార్టీ జరిగిన ఫాంహౌస్లో తనిఖీలు